High Court: ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదు: తెలంగాణ హైకోర్టు

  • అధికారుల నివేదికలపై స్వయంగా సీఎస్ నివేదిక ఇవ్వాలి
  • ఆర్థిక శాఖ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి
  • ఐఏఎస్ లు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది
  • తప్పుడు నివేదికలు ఇస్తే, ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? 

అధికారులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వచ్చిన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదని చెప్పింది.

జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని తెలిపింది. ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని నిలదీసింది.

అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక శాఖ అధికారులు సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఐఏఎస్ లు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పింది. వాస్తవాలు చెప్పాలని సూచించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే, ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని నిలదీసింది.

More Telugu News