Nitin Gadkari: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ వస్తున్న వార్తలపై గడ్కరీ స్పందన

  • నేను ఢిల్లీలోనే విధులు నిర్వహిస్తా
  • ఫడ్నవిస్ సీఎంగా ప్రభుత్వం ఏర్పడుతుంది
  • ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆరెస్సెస్ కు సంబంధం లేదు

ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న పత్రిష్టంభన కొనసాగుతూనే ఉంది. మరోవైపు, మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఇదే అంశంపై గడ్కరీని మీడియా ప్రశ్నించగా... మహారాష్ట్రకు తాను వచ్చే ప్రసక్తే లేదని... ఢిల్లీలోనే తన విధులను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

బీజేపీ నేతృత్వంలో, దేవేందర్ ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంతో ఆరెస్సెస్ కు కానీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. శినసేన మద్దతు తమకు ఉంటుందని, వారితో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు, కాసేపట్లో మోహన్ భగవత్ తో గడ్కరీ సమావేశం కానున్నారు.

More Telugu News