Dera baba: డేరాబాబా అనుచరురాలు హనీప్రీత్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు

  • రెండేళ్లుగా అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో హనీప్రీత్
  • అల్లర్లకు హనీప్రీతే కారణమని తేల్చిన పోలీసులు
  • అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన 29 మంది

రెండేళ్లుగా అంబాలా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పంచకుల అల్లర్ల కేసు ప్రధాన నిందితురాలు, డేరాబాబా అనుచరురాలు హనీప్రీత్‌సింగ్‌కు బెయిలు మంజూరు అయింది. హర్యానా కోర్టు నిన్న ఆమెకు బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆధ్యాత్మిక ముసుగులో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గర్మీత్‌ రాం రహీం సింగ్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది.

పంజాబ్, హర్యానాల్లోని గుర్మీత్ అనుచరులు ఈ తీర్పుపై భగ్గుమన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ అల్లర్లలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు హనీప్రీతే కారణమని తేల్చిన పోలీసులు ఆమెతో పాటు మరో 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిందరినీ 2017లో అంబాలా కోర్టుకు తరలించారు.

More Telugu News