BCCI: ప్రారంభోత్సవ వేడుకలు లేకుండానే ఐపీఎల్... బీసీసీఐ కీలక నిర్ణయం?

  • డబ్బు వృథా అని భావిస్తున్న బోర్డు
  • ఒపెనింగ్ సెర్మనీకి రూ.20 కోట్ల వరకు ఖర్చు
  • ఈ ఏడాది ప్రారంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్
  • ఆ డబ్బును భద్రతా బలగాలకు విరాళంగా ఇచ్చిన బీసీసీఐ

బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్ ల కంటే ఐపీఎల్ ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుందని క్రికెట్ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కు ప్రతి ఏడాది ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ తారలను తీసుకువచ్చి మరీ డ్యాన్సులు చేయించి లీగ్ కు తెరలేపుతున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలకు క్రికెట్ ప్రేమికుల నుంచి పెద్దగా స్పందన ఉండడం లేదని తెలుసుకున్న బీసీసీఐ ఇక ఆ ఆలోచన విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కోట్లు ఖర్చు చేసి కొన్ని గంటల పాటు నిర్వహించే ఓపెనింగ్ సెర్మనీ కారణంగా ఎంతో డబ్బు వృథా అవుతోందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఒక్కో ఓపెనింగ్ సెర్మనీకి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు పుల్వామా ఉగ్రదాడి కారణంగా రద్దు చేశారు. ఆ వేడుకల ఖర్చును బీసీసీఐ భారత భద్రతా బలగాలకు విరాళంగా ఇచ్చింది.

More Telugu News