Nirmala Sitharaman: ఎల్ఐసీ, ఎస్ బీఐకి రూ.25 వేల కోట్ల ప్రత్యేక నిధి ఇస్తాం: నిర్మలా సీతారామన్

  • క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి
  • నిర్మాణ రంగంలో మందకొడి పరిస్థితి ఉందని వ్యాఖ్యలు
  • ప్రధాన నగరాల్లో ప్రాజెక్టులు నిలిచిపోయాయని వెల్లడి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఎల్ఐసీ, ఎస్ బీఐ లకు రూ.25 వేల కోట్ల ప్రత్యేక నిధి కేటాయిస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక నిధిలో భాగంగా తొలిదశలో రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పారు.  ప్రస్తుతం నిర్మాణరంగంలో మందకొడి పరిస్థితి నెలకొందని, ప్రధాన నగరాల్లో చాలా ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. అయితే స్థిరాస్తి వ్యాపార నియంత్రణ సంస్థ (రెరా)లో నమోదైన నిర్మాణ సంస్థలకు ఆర్థికసాయం అందుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తుదిదశలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులకు బ్యాంకుల ద్వారా ఆర్థికసాయం అందిస్తామని వివరించారు.

More Telugu News