onion: ఉల్లి ధరకు మరోసారి రెక్కలు.. నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు

  • రూ.80కి చేరిన కిలో ఉల్లి ధర
  • పలు ప్రాంతాల్లో రూ.100
  • అఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాన్ నుంచి ఉల్లి దిగుమతులకు నిర్ణయం

ఉల్లి ధరకు మరోసారి రెక్కలు వచ్చాయి. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు తగ్గిపోయి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లలో ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.80 మధ్య ఉంది.

పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం వీటి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. అఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాన్ నుంచి ఉల్లి దిగుమతులకు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. కాగా, మార్కెట్లో వీటి ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు వీటిని కొనకుండానే వెనుదిరుగుతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధర రూ.100కి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News