Pakistan: చైనా, పాకిస్థాన్ కుట్ర వల్లే ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం: బీజేపీ యూపీ నేత

  • చైనా, పాకిస్థాన్ విష వాయువులను వదిలినట్లున్నాయి
  • భారత్‌ అంటే ఆ దేశాలు భయపడుతున్నాయి
  • అందుకే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చు

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీనికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు, ఇందుకు పొరుగు దేశాలే కారణమని బీజేపీ ఉత్తరప్రదేశ్ నేత వినీత్‌ అగర్వాల్‌ కొత్త వాదన తెచ్చారు.

చైనా, పాకిస్థాన్ లే భారత్ లోకి విష వాయువులను వదిలినట్లున్నాయని ఆయన అన్నారు. భారత్‌ అంటే ఆ దేశాలు భయపడుతున్నాయని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డాయని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు పాకిస్థాన్ కుట్రలను అడ్డుకుంటుండడంతో ఆ దేశానికి దిక్కుతోచక ఈ చర్యకు పాల్పడుతోందని అన్నారు.

ఆ దేశం విషపూరిత వాయువులను భారత్ లోకి విడుదల చేసిందా? అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వినీత్ అన్నారు. కాలుష్యం పెరిగిపోవడానికి రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడమే కారణమని అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని చెప్పుకొచ్చారు.

More Telugu News