Bigg Boss-3: డేటింగ్ కు పిలిచా.. కానీ రానంది!: పునర్నవి గురించి రాహుల్ సిప్లిగంజ్

  • ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారని వెల్లడి
  • పునర్నవితో రొమాంటిక్ సంబంధం లేదని స్పష్టీకరణ
  • మంచి స్నేహితులం మాత్రమేన్న రాహుల్ 

‘బిగ్ బాస్ సీజన్ -3’ లో పాల్గొన్న నటి పునర్నవికి, విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినవచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై రాహుల్ స్పందించారు. పునర్నవితో తనకు ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదన్నారు.  

‘ఆమెను డేటింగ్ కు పిలిచా. కాని ఆమె రానంది. ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. పునర్నవి అంటే నాకు గౌరవముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఈ షో నాకు చాలా నేర్పింది. వ్యక్తిగత ప్రవర్తన, సహనంతో ఉండటం వంటి అంశాలపై అవగాహన ఏర్పడింది. బహుమతిగా వచ్చిన రూ.50లక్షలతో మంచి ప్లాట్ కొంటాను. ఓట్లేసి గెలిపించిన అభిమానులకందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

More Telugu News