ఆజాద్ ముందే వీహెచ్, షబ్బీర్ అలీ మాటలయుద్ధం

05-11-2019 Tue 18:45
  • గాంధీభవన్ లో పీసీసీతో భేటీ అయిన ఆజాద్
  • షబ్బీర్ అలీపై వీహెచ్ ఆరోపణలు
  • పరస్పరం దూషించుకున్న నేతలు

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఆజాద్ సమక్షంలో సీనియర్ నేతలు వీహెచ్, షబ్బీర్ అలీ వాగ్యుద్ధానికి దిగారు. తాను రిటైర్మెంట్ దశకు వచ్చానని షబ్బీర్ అలీ పదేపదే అంటున్నారని వీహెచ్ ఆరోపించగా, వీహెచ్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అలీ బదులిచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలైన తమను శవాలంటున్నారని, మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో షబ్బీర్ అలీ కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆజాద్ చూస్తుండగానే ఇద్దరు నేతలు పరస్పరం దూషించుకున్నారు. ఆజాద్ సర్దిచెప్పడంతో ఇరువురు శాంతించినా, కాసేపటికి వీహెచ్ అక్కడ్నించి వెళ్లిపోయారు.