'ఖైదీ' దర్శకుడికి కమల్ భారీ ఆఫర్

05-11-2019 Tue 16:10
  • 'ఖైదీ'తో హిట్ అందుకున్న లోకేశ్ కనగరాజ్ 
  • తదుపరి సినిమా కోసం విజయ్ తో సెట్స్ పైకి 
  • లోకేశ్ కనగరాజ్ కోసం సూర్య వెయిటింగ్

కార్తీ కథానాయకుడిగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ 'ఖైదీ' సినిమాను రూపొందించాడు. క్రితం నెల 25వ తేదీన విడుదలైన ఈ సినిమా, తమిళ .. తెలుగు భాషల్లో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు.

'ఖైదీ' సినిమాకి హిట్ టాక్ వచ్చిన వెంటనే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కార్తీ ఎనౌన్స్ చేసేశాడు. ఆల్రెడీ లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సెట్స్ పైకి వెళ్లాడు. సూర్య కూడా లోకేశ్ కనగరాజ్ తో ఒక సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఇక ఈ జాబితాలో కమల్ కూడా చేరిపోయారనేది తాజా సమాచారం. తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయమని భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. వీటిలో లోకేశ్ కనగరాజ్ ముందుగా ఏ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి.