ayodhya: అయోధ్య వివాద పరిష్కారానికి సలహాలు వచ్చినా రాజీవ్‌ గాంధీ పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఒవైసీ

  • ఎంపీ షాబుద్దీన్‌, కేంద్ర మంత్రి కరణ్‌ సింగ్‌లు సలహాలిచ్చారు
  • రాజీవ్‌ గాంధీ ఆసక్తి చూపలేదు
  • రాజీవ్‌ గాంధీ ఆదేశాల మేరకే బాబ్రీ మసీదు తాళాలు తెరిచారు

ఈ నెల 17వ తేదీలోగా అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బాబ్రీ మసీదు అంశంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అయోధ్య వివాద పరిష్కారానికి అప్పట్లో ఎంపీ షాబుద్దీన్‌, కేంద్ర మంత్రి కరణ్‌ సింగ్‌లు సలహాలిచ్చినా వాటిని మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ పట్టించుకోలేదన్న విషయాన్ని హోం శాఖ మాజీ కార్యదర్శి మాధవ్‌ గోడ్బోలే బయటపెట్టారని చెప్పారు.

రాజీవ్‌ గాంధీ ఆదేశాల మేరకే బాబ్రీ మసీదు తాళాలు తెరిచారని అసదుద్దీన్ ఆరోపణలు చేశారు. గోడ్బోలే చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యాలని అన్నారు. అయోధ్య వివాద పరిష్కారంపై రాజీవ్‌ గాంధీ ఆసక్తి చూపలేదని ఆరోపించారు. మాధవ్‌ గోడ్బోలే గతంలో ఓ పుస్తకం రాశారని, అందులో బాబ్రీ మసీదులో పూజలకు అనుమతించిన జిల్లా జడ్జిని మొదటి కరసేవకుడిగా పేర్కొన్నారని, అలాగే, రాజీవ్‌ గాంధీని రెండో కరసేవకుడిగా అభివర్ణించారని చెప్పారు.

More Telugu News