Uttar Pradesh: హెల్మెట్లు పెట్టుకొచ్చి పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు... ఎందుకో తెలిస్తే అవాక్కే!

  • యూపీలోని బాందా జిల్లాలో విద్యుత్ శాఖ భవనం
  • పైకప్పు శిథిలమై ఊడిపడుతున్న పెచ్చులు
  • ఇటీవలి వర్షాకాలంలో గొడుగులు తెచ్చుకుని విధులు

అది ఉత్తర ప్రదేశ్ లోని బాందా జిల్లాలో ఉన్న విద్యుత్ శాఖ భవనం. అక్కడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా..? అక్కడ పని చేయడానికి వచ్చే ఉద్యోగులు తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చి, తమ స్థానాల్లో కూర్చుని విధుల్లో మునిగిపోతున్నారు. ఆ భవంతిలో పైకప్పు పూర్తిగా శిథిలమై పోవడం, ఎప్పుడు, ఎక్కడి నుంచి పెచ్చులు ఊడిపడతాయో తెలియక పోవడంతోనే, తమ ప్రాణాలకు రక్షణగా హెల్మెట్లను తెచ్చుకుంటున్నారు.

"మమ్మల్ని మేము రక్షించుకునేందుకే హెల్మెట్లు పెట్టుకుని వస్తున్నాం. ఏ విధమైన దుర్ఘటనలు జరిగినా, ప్రాణాలైనా మిగులుతాయన్నదే మా ఉద్దేశం. ఈ భవంతి పరిస్థితి ఏ మాత్రమూ బాగాలేదు. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు" అని ఉద్యోగులు వాపోతున్నారు. ఇక వర్షాకాల సీజన్ లో గొడుగులు తెచ్చుకుని విధులను నిర్వహిస్తుంటామని వారు అంటున్నారు. కాగా, ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులు స్పందించాల్సివుంది.

More Telugu News