ICC: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

  • ఆస్ట్రేలియాలో 2020 అక్టోబర్ 18న ప్రారంభం కానున్న మెగా టోర్నీ
  • పూర్తయిన అర్హత పోటీలు
  • గ్రూప్-2 తో భారత్

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ కొత్త ఫార్మాట్లో జరగనుంది. మొత్తం 16 దేశాలు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మరోవైపు ఈ టోర్నీలో ప్రవేశించడానికి అర్హత పొందిన చిన్న జట్లు పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ జట్లు తొలుత సూపర్-12 దశకు తమలో తాము రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో రెండు పెద్ద జట్లను ఐసీసీ తన షెడ్యూల్ లో చేర్చింది.

గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ ఉండగా, గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్ర స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సూపర్-12 కు చేరుతాయి.

గ్రూప్ ‘ఎ’ లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు, గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన జట్టు సూపర్ -12 దశలో గ్రూప్- 1 లో చేరతాయి. ఈ గ్రూపులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉన్నాయి.

ఇక, గ్రూప్ ‘బి’ లో తొలిజట్టు, గ్రూప్ ‘ఎ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టు సూపర్ -12 దశలో గ్రూప్-2 లో జట్లతో తలపడతాయి. ఈ గ్రూప్ లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.

ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అక్టోబర్ 18న గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో జరుగనుంది.  

సూపర్-12 దశలో భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు

భారత్ x దక్షిణాఫ్రికా, అక్టోబర్ 24న  వేదిక పెర్త్, పెర్త్ స్టేడియం సా. 4.30గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, అక్టోబర్ 29న, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ. 1.30గం. నుంచి  ప్రారంభం
భారత్ x ఇంగ్లాండ్, నవంబర్ 1, వేదిక  మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ.1.30 గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, నవంబర్ 5, వేదిక అడిలైడ్, అడిలైడ్ ఒవల్ మైదానం, మ.2 గం. నుంచి ప్రారంభం
భారత్ x అఫ్గానిస్థాన్, నవంబర్ 8, వేదిక సిడ్నీ, సిడ్ని క్రికెట్ మైదానం, మ.1.30 గం. నుంచి ప్రారంభం.

More Telugu News