cars: సరి-బేసి విధానం ఉల్లంఘన.. బీజేపీ నేతకు జరిమానా

  • ఈ విధానం గిమ్మిక్కు మాత్రమేనన్న బీజేపీ నేత విజయ్ గోయల్
  • సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా 
  • ఈ విధానంతో రోడ్డపై కార్ల సంఖ్య 15 లక్షలకు తగ్గుతుందన్న కేజ్రీవాల్

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా నేటి నుంచి సరి- బేసి విధానాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు సరి సంఖ్యల వాహనాలనే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. అయితే, బీజేపీ నేత విజయ్ గోయల్.. ఢిల్లీలో సరి-బేసి సంఖ్య విధానంపై నిరసన తెలిపారు.

బేసి సంఖ్య ఉన్న కారులో తన నివాసం నుంచి బయలుదేరారు. దీంతో ఆయనకు పోలీసులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'ఈ విధానం ఢిల్లీ ప్రభుత్వ గిమ్మిక్కు మాత్రమే. పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడిందని వారు అంటున్నారు. మరి సరి-బేసి విధానం అమలు చేస్తే ఏం లాభం?' అని ప్రశ్నించారు.

సైకిల్ పై ఉప ముఖ్యమంత్రి
  మరోవైపు, ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన కలిగించడం కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సైకిల్ తొక్కుతూ తన కార్యాలయానికి వెళ్లారు.

ప్రతిరోజు 30 లక్షల కార్లు ఢిల్లీ రోడ్లపైకి..
సరి-బేసి విధానంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... 'ప్రతిరోజు 30 లక్షల కార్లు ఢిల్లీ రోడ్లపైకి వస్తున్నాయి. సరి-బేసి విధానం ద్వారా వీటి సంఖ్య కనీసం 15 లక్షలకు తగ్గుతుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రజలు దీనికి మద్దతు తెలుపుతున్నందుకు సంతోషం' అని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలకు నవంబరు 5 వరకు సెలవులు ఇచ్చారు.

More Telugu News