Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఫోన్ నూ వదలని ఇజ్రాయెల్ స్పైవేర్

  • ప్రముఖుల ఫోన్లు హ్యాకైనట్టు వాట్సాప్ వెల్లడి
  • ప్రియాంక ఫోన్ కు కూడా వాట్సాప్ సందేశం
  • వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు

ఇజ్రాయెల్ కు చెంది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'పెగాసస్' పేరుతో స్పైవేర్ ను ప్రముఖుల ఫోన్లలో ప్రవేశపెడుతోందని వాట్సాప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్పైవేర్ బారినపడిన ప్రముఖుల్లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నట్టు వెల్లడైంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ప్రియాంక ఫోన్ లోనే కాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ ఫోన్లలోనూ ఈ స్పైవేర్ చొరబడిందని ఆరోపించారు.

హ్యాకింగ్ కు గురైన వారికి వాట్సాప్ సందేశాలు పంపగా, ఆ సందేశం అందుకున్నవారిలో ప్రియాంక కూడా ఉన్నారని సూర్జేవాలా తెలిపారు. ఇది ప్రభుత్వం చేయిస్తున్న హ్యాకింగ్ అని ఆయన మండిపడ్డారు. స్పైవేర్ పేరుతో నిఘా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ స్పైవేర్ వాట్సాప్ లో ఆడియో/వీడియో కాల్స్ వ్యవస్థలో ఉన్న ఓ లోపాన్ని ఆసరాగా చేసుకుని ఫోన్లలో ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు.

More Telugu News