KCR: ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని చెప్పలేదా?: సీఎం కేసీఆర్ పై భట్టి విమర్శలు

  • ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిక
  • కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపణ
  • మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారంటూ విమర్శలు

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిన్న సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. నవంబరు 5 అర్ధరాత్రిలోగా విధుల్లో చేరకపోతే వారిని ఆర్టీసీ కార్మికులుగా గుర్తించబోమని హెచ్చరించారు. అంతేకాకుండా, 5100 రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లతో బస్సులు నడిపేందుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రూట్లను ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అడ్డంగా మాట్లాడడం ద్వారా కేసీఆర్ ఎంతో యుక్తిగా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ చెప్పలేదా? అని భట్టి నిలదీశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులుపాల్జేసి, లాభాలతో నడుస్తున్న ఆర్టీసీని నష్టాల్లో ముంచేశారని విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో చోటుచేసుకున్న కార్మికుల హత్యలకు కేసీఆరే బాధ్యుడని అన్నారు.

More Telugu News