shiv sena: 170 మంది ఎమ్మెల్యేల మద్దతు: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

  • మరో ఐదుగురు కూడా మద్దతిచ్చే అవకాశం
  • దీంతో ఆ  సంఖ్య 175కు చేరే అవకాశం ఉంది
  • అవసరమైతే ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలుస్తాం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన నౌత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమకు 170 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మరో ఐదుగురు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని దీంతో ఆ  సంఖ్య 175కు చేరే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ విఫలమైతే రెండో పెద్ద పార్టీగా శివసేన... ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' లోనూ పేర్కొన్నారు.

శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు వేర్వేరైనా మహారాష్ట్రలో కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని శివసేన చెప్పింది. కాగా, మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే.వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోంది.

More Telugu News