Asaduddin Owaisi: మార్కెట్‌లో ఏదైనా కొత్త బిస్కెట్ వచ్చిందా?: మహారాష్ట్రలో '50-50' సూత్రంపై ఒవైసీ ఎద్దేవా

  • సీఎం పదవీకాలాన్ని 50-50 పంచుకోవాలంటూ శివసేన డిమాండ్ 
  • 50-50తో ఏం చేస్తారు? అంటూ ఒవైసీ విమర్శలు
  • ప్రజల సమస్యలు పట్టించుకోవాలని హితవు

మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని 50-50 (చెరి సగం) పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. తన పట్టును వీడడం లేదన్న విషయం తెలిసిందే. దీనిపై  ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. '50-50 పేరిట మార్కెట్‌లో ఏదైనా కొత్త బిస్కెట్ వచ్చిందా?' అంటూ ఎద్దేవా చేశారు. 50-50తో ఏం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

మహారాష్ట్ర ప్రజల కోసం బీజేపీ, శివసేన ఏదైనా చేయాలని అసదుద్దీన్ సూచించారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన  సతారా ప్రజల గురించి ఆ పార్టీల నేతలు పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఆ పార్టీల నేతలు మాత్రం 50-50 గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.

కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేనకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని, అయితే, తాము ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకొనే తప్పుడు పనుల్ని చేయబోమని ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More Telugu News