Andhra Pradesh: కొత్త మ్యాప్ విడుదల చేసిన కేంద్రం.. అమరావతి గల్లంతు!

  • అధికారికంగా రెండుగా విడిపోయిన జమ్మూకశ్మీర్
  • 9కి పెరిగిన కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య
  • ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్‌లో కనిపించని అమరావతి  

కేంద్రం తాజాగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గల్లంతైంది. జమ్మూకశ్మీర్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఏడు నుంచి 9కి పెరిగింది. దీంతో వాటిని చేరుస్తూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.

ఆ మ్యాప్‌లోని అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానులను చూపించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రం గుర్తించలేదు. ఏపీ రాజధానిని చూపించే ఎటువంటి సూచికలు ఆ మ్యాప్‌లో లేకపోవడం వివాదాస్పదమవుతోంది. మ్యాప్‌లో అసలు అమరావతి పేరే లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి ఐదేళ్లు దాటినా కేంద్రం దానిని గుర్తించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

More Telugu News