TSRTC: ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో విపక్షాలపై ఎదురుదాడికి దిగిన సీఎం కేసీఆర్

  • కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం
  • ఆర్టీసీ సమ్మెపై చర్చ
  • భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ఈ పార్టీలే జవాబుదారీ అన్నారు. ఈ నేతలు కార్మికుల సమస్యలను ఆర్చేవాళ్లా, తీర్చేవాళ్లా? అని ప్రశ్నించారు.

కేంద్రంలో ఓ విధంగా మాట్లాడుతూ, రాష్ట్రానికొచ్చేసరికి మరో విధంగా మాట్లాడతారా? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మోటార్ వెహికిల్ చట్టం ఆమోదం పొందడంలో నలుగురు బీజేపీ సభ్యులు కీలకపాత్ర పోషించింది నిజం కాదా? అని కేసీఆర్ నిలదీశారు.

రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? ఇక్కడకొచ్చి డ్రామాలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపైనా నిప్పులు చెరిగారు.  ఇష్టం వచ్చినట్టు ప్లాట్ ఫాం స్పీచ్ లు దంచడం కాదని, తాను అడిగేవాటికి సమాధానం చెప్పాలని అన్నారు.

More Telugu News