Chennai Airport: అది మార్ఫింగ్ చేసిన ఫొటో... వైరల్ చేయొద్దు: ఎయిర్ పోర్ట్ అథారిటీ

  • అనువాదం తప్పంటూ ఫొటోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి షబానా అజ్మీ
  • నిజాలు తెలుసుకోకుండా వైరల్ చేయొద్దన్న ఏఏఐ
  • 2015 నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని వెల్లడి

చెన్నై విమానాశ్రయంలో ఉన్న ఓ సైన్ బోర్డు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ బోర్డుపై ‘కార్పెట్ పై తినొద్దు’ అన్న హిందీ వ్యాఖ్యానికి  అనువాదంగా ఇంగ్లీష్ లో ‘ ఈటింగ్ కార్పెట్ స్ట్రిక్ట్ లీ ప్రొహిబిటెడ్’ అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యానికి అర్థం  ‘కార్పెట్ ను తినొద్దు’ అని. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొంతమంది వాటిని తమ స్నేహితులకు పంపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఇటీవల ఈ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అనువాదం తప్పుగా ఉందని పేర్కొన్నారు.  ఇంకేముందీ నెటిజన్లు ఈ ఫొటోను వైరల్ చేసేశారు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. "ఇది మార్ఫింగ్ చేసిన ఫొటో, 2015 నుంచి ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది, నిజాలు తెలుసుకోకుండా దీన్ని వైరల్ చేయవద్దు" అని కోరింది.

More Telugu News