Tik Tok: టిక్ టాక్ నుంచి ‘నట్ ప్రో-3’ స్మార్ట్ ఫోన్

  • కనీస ధర రూ. 29 వేలుగా నిర్ణయం
  • మూడు వేరియంట్లలో లభ్యం
  • హై ఎండ్ ఫోన్ ధర సుమారు రూ.36 వేలు

టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ తన తొలి స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ‘స్మార్టిసన్ జియాంగ్వో  ప్రో -3’ (నట్ ప్రో-3) పేర  లాంచ్ చేసిన ఈ ఫోన్ లో మూడు వేరియంట్లున్నాయని కంపెనీ తెలిపింది. బేసిక్ వేరియంట్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని కలిగివుందని, దీని ధర సుమారుగా రూ.29 వేల వరకు ఉంటుందని తెలిపింది. 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఉన్న ఫోన్ ధర రూ.32 వేలుగా ఉంటుందని, హై ఎండ్ ఫోన్ లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీని కలిగివుందని.. దీని ధర రూ.36 వేల వరకు నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది.

నట్ ప్రో -3 స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. 6.39 అంగుళాల  ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనుక భాగంలో 48 ఎంపీ సామర్థ్యమున్న ప్రధాన కెమెరా, 13 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 X ఆప్టికల్ జూమ్‌తో 8 ఎంపీ టెలిఫొటో లెన్స్, 5 ఎంపీ మాక్రో కెమెరాలుంటాయి. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20 ఎంపీగా ఉంది. బ్యాటరీ 4000 ఎంఏహెచ్ ను కలిగివుంది. స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ దీని సొంతం.

More Telugu News