ISRO: చంద్రయాన్-2 కథ ముగియలేదు: ఇస్రో చైర్మన్ శివన్

  • విఫలమైన చంద్రయాన్-2
  • ఆఖర్లో కుప్పకూలిన ల్యాండర్
  • భవిష్యత్తులో సాఫ్ట్ ల్యాండింగ్ సాధిస్తామని శివన్ ఆత్మవిశ్వాసం

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిపోవడంతో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై ఇస్రో చైర్మన్ శివన్ మరోసారి స్పందించారు. చంద్రయాన్-2 కథ ముగియలేదని, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్-2ను తాము విఫల ప్రయోగంగా భావించడంలేదని, దీని ద్వారా ఎంతో విలువైన సాంకేతిక అనుభవం సముపార్జించామని చెప్పారు. మరి కొన్నేళ్లలో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను ఇస్రో సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ ఐఐటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News