Varla Ramaiah: నాడు వైఎస్సార్ ఇచ్చిన జీవోపై మండిపడిన అమర్, శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?: వర్ల రామయ్య

  • అమర్, శ్రీరామచంద్రమూర్తిలను నిలదీసిన వర్ల రామయ్య
  • ముఖ్యమంత్రి విసిరిన పదవులతో మౌనం వహించారా? అంటూ వ్యాఖ్యలు
  • అధికారం ఎలాంటివాళ్లనైనా లొంగదీస్తుందంటూ ట్వీట్

ఏపీలో మీడియాపై వైసీపీ సర్కారు విధించిన ఆంక్షలను టీడీపీ నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 938 జీవో తీసుకువస్తే అది పత్రికా స్వేచ్ఛకు ఉరిత్రాడు అని ఉద్యమం చేపట్టిన అమర్, శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు నోరెత్తకపోవడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి విసిరిన పదవుల కారణంగానే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారా? అని నిలదీశారు. ఎంతటివాళ్లనైనా అధికారం లొంగదీస్తుంది కదా! అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దేవులపల్లి అమర్ ను ఏపీ సర్కారు ప్రభుత్వ జాతీయ, అంతర్రాష్ట్ర మీడియా సలహాదారుగా, శ్రీరామచంద్రమూర్తిని ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

More Telugu News