Vishal: భారీ రేటుకు విశాల్ 'యాక్షన్' సినిమా హక్కులు

  • విశాల్ హీరోగా 'యాక్షన్' మూవీ 
  • కీలకపాత్రలో సీనియర్ హీరో రాంకీ 
  • ఈ నెల 15న రెండు భాషల్లోను విడుదల

తమిళ .. తెలుగు భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రం 'యాక్షన్' .. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విశాల్ జోడీగా తమన్నా కనిపించనుంది. రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు 5 కోట్లకి అమ్ముడైనట్టుగా సమాచారం. ఇంతకుముందు తెలుగులో వచ్చిన విశాల్  సినిమాలు 'అభిమన్యు' .. 'డిటెక్టివ్' బాగా ఆడటం, ఇటీవల అనువాద చిత్రాలుగా వచ్చిన 'విజిల్' .. 'ఖైదీ' చిత్రాలకి ఇక్కడ మంచి ఆదరణ లభించడం వలన 'యాక్షన్' సినిమాకి ఈ స్థాయి రేటు పలికిందని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News