karthi: 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'ఖైదీ'

  • గత నెల 25న వచ్చిన 'ఖైదీ'
  • తమిళనాట 25 కోట్ల వసూళ్లు 
  • దేశవ్యాప్తంగా 40 కోట్లు రాబట్టిన సినిమా

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీకి, 'ఖైదీ' ఫలితం ఊరటనిచ్చింది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా కార్తీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విజయ్ 'విజిల్' పోటీని తట్టుకుని నిలబడింది. వారం రోజులకి పైగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది.

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తమిళనాడులోనే 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా దేశవ్యాప్తంగా 40 కోట్లకి పైగా .. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కొత్తగా విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం.

More Telugu News