Sharwanand: శర్వానంద్ చిత్రంలో కీలక పాత్రలో అమల... సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

  • శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వా కొత్త చిత్రం
  • ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి
  • వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశాలు

యువ హీరో శర్వానంద్ కొత్త చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమల అక్కినేని ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. పెళ్లిచూపులు ఫేమ్ రీతూవర్మ ఇందులో కథానాయిక. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సీనియర్ నటుడు నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ తదితరులు ఈ సినిమాలో ఇతర తారాగణం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, శర్వా చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాస్తున్నారు. ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

More Telugu News