perni nani: దుర్మార్గపు కథనాలు రాస్తే ఊరుకోవాలా?: ఏపీ మంత్రి పేర్ని నాని

  • మా వ్యక్తిత్వాన్ని హరిస్తూ మాట్లాడొద్దంటే ఎలా?
  • వార్తలు రాసేముందు కేంద్ర ప్రభుత్వ చట్టాలను గుర్తించుకోవాలి 
  • ఉద్దేశ పూర్వకంగా వార్తలు రాయొద్దు

పత్రికా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని, అయితే, పాత్రికేయులకు ఏది రాయాలో ఏది రాయకూడదో అన్న దానిపై విచక్షణ ఉండాలని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం నడుచుకుంటే మంచిదన్నారు. ‘మా వ్యక్తిత్వాన్ని హరిస్తుంటే మేం మాట్లాడకూడదంటే ఎలా? మీరు తుపాకీతో కాలిస్తే మేం పడిపోవాలా.. ముక్కుపచ్చలారని ప్రభుత్వంపై దుర్మార్గపు కథనాలు రాస్తారా?’ అని ప్రశ్నించారు. పత్రికల యాజమాన్యాలు సుప్రీంకోర్టును మించి తామే అధికులమన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు.

ఇతర రాష్ట్రాలలో ఉన్న మీడియా సంస్థలు వేరు.. ఏపీలో ఉన్న మీడియా సంస్థల తీరు వేరు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో ఉద్దేశపూర్వకంగా వార్తలు రాయించొద్దని పత్రిక యాజమాన్యాలకు మంత్రి సూచించారు.

More Telugu News