Polavaram Project: స్టే ఎత్తివేతతో పోలవరం పనులు షురూ.. భూమిపూజ చేసి మొదలెట్టిన మేఘా సంస్థ

  • స్పిల్ వే వెనుక భాగంలో పనులు మొదలు 
  • నిర్ణీత సమయంలోనే ప్రాజెక్టు పూర్తవుతుందన్న మంత్రి అనిల్
  • సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు 

పోలవరం నిర్మాణ పనులపై ఉన్న స్టేను నిన్న ఏపీ హైకోర్టు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో ఈ ప్రాజక్టు పనులు మళ్లీ మొదలయ్యాయి. నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ పనులను ప్రారంభించింది. ఈ రోజు మేఘా సంస్థ ప్రతినిధులు స్పిల్ వే వెనుక భాగంలో భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి పనులు ప్రారంభం, పూర్తి చేసే కాలం షెడ్యూళ్లను తమ ప్రభుత్వం ముందే నిర్ణయించుకుందన్నారు. గత ప్రభుత్వం ఆర్.అండ్.ఆర్ ను నిర్లక్ష్యం చేసిందన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే ఎటువంటి పరిస్థితిలోనూ తప్పరని పేర్కొన్నారు.

More Telugu News