New Delhi: నవంబరు 5 వరకు ఢిల్లీలో పాఠశాలల మూసివేత... ప్రమాదకర స్థాయికి కాలుష్యం!

  • కాలుష్యం కోరల్లో దేశ రాజధాని
  • స్కూళ్ల మూసివేతపై కేజ్రీవాల్ తాజా ఆదేశాలు
  • ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా ఢిల్లీ కాలుష్య స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల వ్యర్థాలు భారీగా తగలబడుతుండడంతో ఢిల్లీ నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. పీల్చే గాలిలో నష్టదాయక వాయువుల మోతాదు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు నవంబరు 5 వరకు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. అటు, ఢిల్లీలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించారు.

More Telugu News