driver babu: ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. చర్చలు జరిపితేనే అంత్యక్రియలు చేస్తామన్న కుటుంబ సభ్యులు

  • సకల జనుల సమరభేరికి హాజరై గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ బాబు
  • మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన ఎంపీ బండి సంజయ్, మంద కృష్ణ మాదిగ
  • నేడు కూడా కరీంనగర్ బంద్

ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబ సభ్యులు భీష్మించుకున్నారు. దీంతో కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు రెండు రోజుల క్రితం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరికి హాజరైన డ్రైవర్ బాబు గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.

మరోవైపు, కరీంనగర్ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ రెండో రోజు కూడా పిలుపునివ్వగా, విద్యా, వ్యాపార సంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. జిల్లాలోని ఆరేపల్లిలో జరిగిన నిరసనల్లో ఎంపీ బండి సంజయ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. డ్రైవర్ బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

More Telugu News