Credit card: డార్క్ వెబ్ లో అమ్మకానికి భారతీయుల క్రెడిట్ కార్డులు

  • సుమారు 13 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డులు
  • జోకర్స్ స్టాష్ అనే సంస్థ వెబ్ లో పెట్టిందన్న సైబర్ సెక్యూరిటి సంస్థ
  • ఒక్కో కార్డు ధర వంద డాలర్లుగా నిర్ణయం

భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డులు లక్షల కొద్దీ క్లోనింగ్ కు గురయ్యాయి. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద అమర్చిన స్కిమ్మింగ్ పరికరాల మాధ్యమంగా డేటాను చోరీచేసి నమూనాలను తయారు చేశారని గ్రూప్ బి అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. వీటిని డార్క్ వెబ్ లో జోకర్స్ స్టాష్ అనే సంస్థ అమ్మకానికి పెట్టిందని గ్రూప్ బి తెలిపింది.

సుమారు 13 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో కార్డు ధర వంద డాలర్లుగా నిర్ణయించింది. కాగా, ఈ నకిలీ కార్డులపై ఆర్బీఐ  స్పందించిందని సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. ఖాతాదారులకు కొత్త కార్డులు జారీచేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించిందని తెలుస్తోంది. జోకర్స్ స్టాష్ తొలిసారిగా ఆగస్టు 22న పెట్రోల్ బంకుల్లోని పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా తస్కరించిన డేటా ఆధారంగా తయారు చేసిన కార్డులను అమ్మకానికి పెట్టింది.

More Telugu News