Gitanjali: చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి గారికి చెందిన శ్రీనివాస థియేటర్స్ కు వెళ్లేవాళ్లం: పవన్ కల్యాణ్

  • నటి గీతాంజలి కన్నుమూత
  • స్పందించిన పవన్ కల్యాణ్
  • గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ వ్యాఖ్య

సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో మరణించడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు సినీ రంగంలో ఉన్న సీనియర్లలో గీతాంజలి ఒకరని, ఆమె మరణం బాధాకరం అని పేర్కొన్నారు. గీతాంజలి పేరు చెబితే 'సీతారామ కల్యాణం' చిత్రంలోని 'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' అనే పాటలోని సీతాదేవి గుర్తుకు వస్తుందని తెలిపారు. తెలుగులోనే కాకుండా ఆమె అనేక భాషల్లో నటించి తనదైన శైలిలో వినోదం అందించారని పవన్ కొనియాడారు.

అంతేగాకుండా, గీతాంజలితో తమ అనుబంధాన్ని కూడా పవన్ వెల్లడించారు. అప్పట్లో తాము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి కుటుంబానికి చెందిన శ్రీనివాస థియేటర్స్ కు వెళ్లేవారమని, అక్కడ గీతాంజలి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్లమని వెల్లడించారు. ఆ అనుబంధం హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగిందని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసైనికుల తరఫున ప్రగాడ సానుభూతి తెలుపుకుంటున్నట్టు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News