Ashok Gehlot: బీజేపీ అడుగులు అటువైపే.. ఆ పార్టీని నమ్మొద్దు: బీజేపీ మిత్రపక్షాలకు అశోక్ గెహ్లాట్ హెచ్చరిక

  • ఏక పార్టీ పాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది
  • చైనా తరహా పాలన కోసం యత్నిస్తోంది
  • బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు

బీజేపీ మిత్రపక్షాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలకనేత అశోక్ గెహ్లాట్ హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ఏక పార్టీ పాలనను తీసుకొచ్చేందుకు బీజేపీ అడుగులు వేస్తోందని... ఈ విషయం తెలియని మిత్రపక్షాలు ఆ పార్టీని నమ్మి, మద్దతిస్తున్నాయని చెప్పారు.

బీజేపీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని ఆయన విమర్శించారు. చైనాలో ఉన్న విధంగా ఏక పార్టీ పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీకి మద్దతిస్తున్న ప్రతి పార్టీ గ్రహించాలని హితవు పలికారు. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని ఆమె మండిపడ్డారు.

More Telugu News