Bigil: 'బిగిల్' సినిమాలోని ఆ సన్నివేశాల తొలగింపు

  • అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ విజయ్ మాటలు
  • వెల్లువెత్తిన విమర్శలు
  • దాంతో పాటు మరికొన్ని సీన్లు కూడా కట్

తమిళ నటుడు విజయ్ నటించిన ‘బిగిల్’ (తెలుగులో విజిల్) చిత్రంలో ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ కథానాయకుడు విజయ్ మాట్లాడిన మాటల సన్నివేశాన్ని తొలగించారు. విజయ్ అలా మాట్లాడడం కథానాయకుడి వ్యూహం. అలా రెచ్చగొడితే వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా విజయం సాధించవచ్చనేది హీరో ఆలోచన. అయితే, అమ్మాయి ఆకారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ఈ కారణంగా సినిమాపై వ్యతిరేక ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఆ సీన్‌ను తొలగించారు. దీంతో పాటు మరికొన్ని సీన్లను కూడా కట్‌చేసి బాగా ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని తగ్గించారు.

More Telugu News