brinjal: లైంగిక వాంఛలు తెలిపే ఎమోజీలపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిషేధం

  • వంకాయ, పీచ్ పండ్లు, నీటి బిందువుల ఎమోజీలపై నిషేధం
  • నగ్న చిత్రాల పోస్టింగులపై బ్యాన్
  • మండిపడుతున్న యూజర్లు

లైంగిక కోరికలను వెల్లడించే ఎమోజీలతోపాటు నగ్న ఫొటోల పోస్టింగ్‌లపై సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు నిషేధం విధించాయి. అయితే, ఈ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తాజా నిర్ణయం ప్రకారం.. వంకాయ, పీచ్ పండు, కిందపడుతున్న నీటి బిందువులను ఇకపై ఎమోజీలుగా ఉపయోగించకూడదు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అలాగే, కాల్‌గాళ్స్ తమ వ్యాపారవృద్ధి కోసం ఈ మాధ్యమాలను వాడుకోకుండా నగ్న ఫొటోల పోస్టింగులను నిషేధించినట్టు పేర్కొన్నాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పరస్పర లైంగిక వాంఛలను తెలియజేసే ఇలాంటి ఎమోజీల వల్ల తనలాంటి పెళ్లయిన మగవాళ్లు అంతులేని బాధను అనుభవించాల్సి వస్తోందంటూ ఇటీవల 42 ఏళ్ల ర్యాప్ సంగర్ కన్యే వెస్ట్‌ వాపోయాడు. ఇటువంటి వారికి ఈ నిర్ణయం శుభవార్తే అవుతుందని యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఆయన భార్య కిమ్‌ కర్దాషియిన్ ‘ఎక్స్‌పోజింగ్‌’ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటే బాధ పడని వ్యక్తి ఇలాంటి వాటికి బాధపడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పట్టించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉండగా వాటిని మానేసి ఎమోజీలపై పడడం దారుణమంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై యూజర్లు మండిపడుతున్నారు.

More Telugu News