Pakistan: సిక్కుల మత గురువు గురునానక్ స్మారక నాణేన్ని విడుదల చేసిన పాక్

  • రూ.50 విలువైన నాణెం, స్టాంపులు విడుదల
  • కర్తార్‌పూర్ యాత్రికులకు అందుబాటులో
  • భారత యాత్రికుల తొలి విడత జాబితాను పాక్‌కు అందించిన భారత్

గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రభుత్వం రూ.50 విలువైన గురునానక్ స్మారక నాణేన్ని విడుదల చేసింది. దీంతోపాటు రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసింది. వీటిని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించే యాత్రికులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా, ఇటీవల ప్రారంభమైన కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా 575 మంది భారత యాత్రికులు గురుద్వారా కర్తార్‌పూర్‌ను సందర్శించనున్నారు. వచ్చే నెల 9న ఈ బృందం పాకిస్థాన్ బయలుదేరనుండగా వీరికి సంబంధించిన జాబితాను భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు అందజేసింది.

More Telugu News