Maharashtra: ఉద్ధవ్ తన వైఖరి స్పష్టం చేయాలి.. అప్పుడే మా మద్దతు: కాంగ్రెస్‌ ఎంపీ హుస్సేన్‌ దాల్వాయ్‌

  • బీజేపీతో ఉంటారో, వేరుపడతారో శివసేన తేల్చుకోవాలి
  • వారికి మద్దతు ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదు
  • మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు 44 స్థానాలు

మహారాష్ట్రలో జట్టుకట్టి పోరాడిన బీజేపీ, శివసేన మధ్య అధికారం విషయంలో ఏర్పడిన విభేదాలు అక్కడి పరిస్థితిని రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఓవైపు రెండు పక్షాలు మెట్టు దిగక పోవడం, మరోవైపు అవకాశం కోసం కాంగ్రెస్‌ ఎదురు చూస్తుండడంతో రాజకీయం ఆసక్తిగా మారింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు హుస్సేన్‌ దాల్వాయ్‌ చేసిన వ్యాఖ్యలు మరో ఆసక్తికర అంశానికి తెరదీశాయి.

‘శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే అంతకు ముందు తాము బీజేపీతో ఉండాలా? బయట పడాలా? అన్న విషయాన్ని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్‌ తేల్చుకోవాలి’ అంటూ ఓ అస్త్రాన్ని సంధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, శివసేనకు మధ్య బంధం బెడిసికొడితే కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

More Telugu News