sand policy: ఊరికో ఇసుకాసురుడు...అంతా వైసీపీ నాయకులే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

  • చావు బాజా మోగిస్తూ వారోత్సవాలకు పిలుపా 
  • ఆరుగురు కూలీల ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమే 
  • ముందు ఇసుకాసురుల భరతం పట్టాలని డిమాండ్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకుల్లో ఊరికో ఇసుకాసురుడు ఆవిర్భవించారని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ముందుగా వారి భరతం పట్టి ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇసుక నియంత్రణ పేరుతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకొంటున్నారని ధ్వజమెత్తారు. సొంత ఊరిని ఆనుకుని ప్రవహిస్తున్న వాగు నుంచి ఇసుక తీసుకు వెళ్లాలన్నా అనుమతులు ఏమిటని ప్రశ్నించారు.

ఇసుక కొరత కారణంగా ఆరుగురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దానిపై మాట్లాడకుండా వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. చావు బాజా మోగించాక వారోత్సవాలు ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించడంతోపాటు కార్మిక సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News