Gold: ముగిసిన పండుగ సీజన్... తగ్గిన బంగారం ధర

  • 10 గ్రాముల బంగారం ధర రూ.38,857
  • ఒక్కరోజే రూ.548 తగ్గుదల నమోదు
  • వెండి కిలో ధర రూ.47,090

దేశంలో పండుగ సీజన్ పూర్తికావడంతో బంగారం ధర తగ్గింది. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తుండటంతో  ఆ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధరలపై పడింది. దీంతో దేశంలోని మార్కెట్లలో పసిడి ధరలు తగ్గాయి. ఈరోజు  ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర రూ. 548 తగ్గి రూ.38,857కు చేరింది. గతవారం ఈ ధర 39వేల రూపాయలకు పైగా పలికింది. వెండి ధర కూడా  క్షీణించింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,190 తగ్గి రూ.47,090కు చేరింది.

More Telugu News