Raghavendra Rao: తెరపైకి చిల్లర డబ్బులు విసరడమనేది నా సినిమాతోనే మొదలైంది: దర్శకుడు రాఘవేంద్రరావు

  • ఎన్టీఆర్ తో తొలి సినిమా 'అడవిరాముడు'
  • ఆయనతో సినిమా అనగానే టెన్షన్ మొదలైంది 
  • కోటికిపైగా వసూలు చేసిందన్న రాఘవేంద్రరావు 

తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'అడవిరాముడు' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఎన్టీ రామారావుగారు అప్పటికే మహామహులతో పనిచేసి వున్నారు. అలాంటి రామారావుగారు నాతో 'అడవిరాముడు' చేయడానికి ఒప్పుకున్నారని నిర్మాతలు చెప్పగానే టెన్షన్ మొదలైపోయింది.

రామారావుగారితో కొత్తగా ఏం చేయాలి .. ఎలా చూపించాలి అనే విషయంపై బాగా కసరత్తు చేశాను. తెలుగు చిత్రపరిశ్రమలో కోటి రూపాయల వసూళ్లు దాటిన తొలి సినిమా ఇదే. ప్రొజెక్టర్ ఆపరేటర్లు షిఫ్టులు మారారుగానీ, వీల్ ఆగకుండా కంటిన్యూ గా నడిచిన సినిమాగా 'అడవిరాముడు'కి మరో రికార్డు వుంది. అంతకుముందు రామారావుగారి సినిమాలకి అభిమానులు హారతులు ఇచ్చేవారు .. పూలు చల్లే వారు. తెరపైకి చిల్లర డబ్బులు విసరడమనేది 'అడవిరాముడు' సినిమాతోనే మొదలైంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News