Car: అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

  • మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లాలో ఘటన
  • చిన్నారి సహా నదిలో పడ్డ ఐదుగురు
  • బ్రిడ్జిపై ఉన్న వ్యక్తులకు చిన్నారిని క్యాచ్ విసిరిన వ్యక్తి

ఓ కారు అదుపుతప్పి నదిలో పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లా, ఓర్చాలో ఓ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తోన్న ఓ కారుకు ఎదురుగా ఆటో వచ్చింది. దీంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు నడుపుతున్న వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది నదిలో పడింది.

అది అంతగా లోతు లేకపోవడంతో ఆ కారులోంచి ఆ ఐదుగురు బయటకు వచ్చారు. కారులోని చిన్నారిని బయటకు తీసిన ఓ వ్యక్తి బ్రిడ్జిపై ఉన్న వ్యక్తుల వైపునకు ఆ పసివాడిని విసిరేశాడు. అయితే, వారు ఆ చిన్నారిని క్యాచ్ పట్టలేకపోవడంతో మళ్లీ నీళ్లలో పడిపోయాడు. అనంతరం బ్రిడ్జిపైనున్న ఓ వ్యక్తి నీళ్లలోకి దూకి ఆ చిన్నారిని పైకి తెచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి మిగతా వారిని కూడా స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. 

More Telugu News