Karnataka: శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద... నాలుగు గేట్ల మూసివేత!

  • కర్ణాటకలో తగ్గిన వర్షాలు
  • కేవలం 2 గేట్ల నుంచి నీటి విడుదల
  • పూర్తి స్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ కేంద్రాలు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు తగ్గడంతో, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీటి పరిమాణం కూడా తగ్గింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద గణనీయంగా తగ్గింది. పర్యవసానంగా జలాశయం నాలుగు క్రస్ట్ గేట్లను మూసివేసి, కేవలం 2 క్రస్ట్ గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి వదులుతున్నామని, వివిధ ఎత్తిపోతల పథకాలు, కాలువల ద్వారా మరో 70 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని అన్నారు.

More Telugu News