China: ఇక బంగారం కొనుగోలు కష్టమే.. డిసెంబరు నాటికి రూ.42 వేలకు పసిడి!

  • పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు
  • ఈ ఏడాది చివరి వరకు కొనసాగనున్న బుల్లిష్ ట్రెండ్ 
  • అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం చల్లబడితేనే ధరల్లో మార్పు

బంగారం అంటే మోజుపడే మహిళలకు ఇది చేదువార్తే. మున్ముందు బంగారం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.42 వేలకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులతోపాటు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ మారకంలో రూపాయి బలహీనత వంటివి ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు.

బంగారం ధరల్లో బుల్లిష్ ట్రెండ్‌కు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్‌ రీసెర్చ్‌ కోఫౌండర్‌, సీఈఓ జ్ఞాన్‌శేఖర్‌ త్యాగరాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302 స్థాయిలో ఉండగా, కామెక్స్‌లో ఔన్స్‌ ధర 1,506 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధరలు 15 శాతం పెరిగినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమోడిటీ రీసెర్చ్‌) నవనీత్‌ దమానీ తెలిపారు. అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణం చల్లబడితే ధరల్లో కొంత దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని నవనీత్ పేర్కొన్నారు.

More Telugu News