Brexit: ఎటూ తేల్చుకోలేకపోతున్న బ్రిటన్... బ్రెగ్జిట్ గడువు మరోసారి పొడిగింపు

  • 3 నెలలు పొడిగిస్తూ ఈయూ కౌన్సిల్ నిర్ణయం
  • ఈయూలోని 27 సభ్యదేశాలు అంగీకారం
  • బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హర్షం

బ్రెగ్జిట్ పై ప్రజాభిప్రాయం చేపట్టి అనుకూలంగా నిర్ణయం పొందినప్పటికి యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఫలితంగా బ్రిటన్ ఈ గడువు పొడిగింపును కోరుతూ వస్తోంది. ప్రస్తుత గడువు ఈ నెల 31న పూర్తి కానుండటంతో మరో మూడు నెలలు పొడిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈయూకు లేఖ రాశారు. దీనిపై ఈయూ సభ్యదేశాలు చర్చించి ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. పొడిగింపునకు 27 దేశాలు ఓకే చెప్పడంతో, ఈయూ ప్రెసిడెంట్ డోనాల్డ్ టస్క్ తమ నిర్ణయాన్ని బ్రిటన్ కు తెలుపుతూ సందేశం పంపారు. దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News