Rajendra Prasad: 'తోలుబొమ్మలాట' ట్రైలర్ రిలీజ్ డేట్

  • కుటుంబ కథా చిత్రంగా 'తోలుబొమ్మలాట'
  • కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

రాజేంద్రప్రసాద్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మీ శ్రేయోభిలాషి' .. 'ఆ నలుగురు' సినిమాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో తన తాజా చిత్రం చేరిపోవడం కూడా ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఆ సినిమా పేరే 'తోలుబొమ్మలాట'. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, కుటుంబాలు  .. బంధాలు .. అవసరాలు .. అవకాశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో .. దుర్గాప్రసాద్ మాగంటి నిర్మాణంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియపరుస్తూ వదిలిన స్పెషల్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News