TSRTC: విలీనం డిమాండ్ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించాలన్న హైకోర్టు

  • కొనసాగుతున్న ఇరువర్గాల వాదనలు
  • యూనియన్ల తరఫున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి 
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో మరోసారి  విచారణ ప్రారంభమయింది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టాయని, కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదని, చర్చలు జరపకుండానే యూనియన్ నేతలు బయటకు వెళ్లిపోయారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.

మరోవైపు ప్రభుత్వం ఒక్క డిమాండ్ పైనే పట్టుబట్టడం సరికాదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని, 21 డిమాండ్లపైనే చర్చిస్తామంటూ.. ఇతర డిమాండ్లను పట్టించుకోలేదని యూనియన్ తరపు న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు. మరోవైపు కోర్టు స్పందిస్తూ..   కార్పోరేషన్ పై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చలు సాగాలని పేర్కొంది. మొదట యూనియన్ పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చలు సాగితే.. కార్మికుల్లో  ఆత్మస్ఘైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది.

More Telugu News