Prabhas: కొరటాల, ప్రభాస్ చర్చలు .. మరో సినిమాకి స్కెచ్

  • చిరూ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో కొరటాల
  • ఆ తరువాత సినిమా చరణ్ తోనే 
  • ప్రభాస్ కి మాట ఇచ్చిన కొరటాల

ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించిన పనులతో కొరటాల వున్నారు. వచ్చేనెలలో ఆయన చిరంజీవితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన చరణ్ తో చేయనున్నారు. ఈ విషయాన్ని చరణ్ ధ్రువీకరించాడు కూడా. చరణ్ సినిమా తరువాత ప్రభాస్ ప్రాజెక్టును కొరటాల పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.

'సాహో' ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రభాస్ ను నిరాశ పరిచింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన, ఆ తరువాత సినిమా కొరటాలతో వుంటే బాగుంటుందని భావించాడట. ఈ కారణంగానే నిన్న దీపావళి రోజున కొరటాల - ప్రభాస్ కలవడం జరిగిందని అంటున్నారు. దర్శకుడిగా కొరటాల పరిచయమైంది ప్రభాస్ తో చేసిన 'మిర్చి'తోనే. అందువల్లనే ప్రభాస్ కి కొరటాల మాట ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News