shav sena: ఆన్ లైన్ వ్యాపారం ద్వారా విదేశాలకు లబ్ధి: బీజేపీపై శివసేన తీవ్ర విమర్శలు

  • దేశంలో ఆర్థిక మంద గమనానికి బీజేపీ విధానాలే కారణం
  • దేశంలోని రీటైల్ వ్యాపారం రోజురోజుకీ పడిపోతోంది 
  • దేశ ఆర్థిక వ్యవస్థ పక్కదారి పట్టింది

దేశంలో ఆర్థిక మందగమనానికి బీజేపీ విధానాలే కారణమని విమర్శిస్తూ శివసేన తమ పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. దేశంలోని రీటైల్ వ్యాపారం రోజురోజుకీ పడిపోతోందని, ఆన్ లైన్ వ్యాపారం ద్వారా విదేశాలకు లబ్ధి చేకూరుతోందని శివసేన పేర్కొంది.

బీజేపీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాలే ఆర్థిక మందగమనానికి కారణమని శివసేన తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాలు దేశానికి ఏ మాత్రమూ ఉపయోగపడలేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పక్కదారి పట్టిందని పేర్కొంది. కాగా, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు చేయడం గమనార్హం. 

More Telugu News