TSRTC: మహిళా కండక్టర్ ఆత్మహత్య.. డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన

  • ఆత్మహత్యకు పాల్పడ్డ కండక్టర్ నీరజ
  • ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. అటు ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు కానీ వెనకడుగు వేయడం లేదు. మరోవైపు, సమ్మెకు దిగిన కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమ కుటుంబ భవిష్యత్తు ఏమటనే భయాందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళా కండక్టర్ నీరజ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో ఆమె పని చేస్తున్నారు. ఆమె మరణ వార్తతో ఆర్టీసీ కార్మికుల్లో విషాదం నెలకొంది. మరోవైపు నీరజ బలవన్మరణం నేపథ్యంలో ప్రభుత్వంపై ఆగ్రహించిన కార్మికులు.. సత్తుపల్లి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు.

More Telugu News